Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
రాష్ట్రాలు

వ్యవసాయ దిగుబడిని పెంపొందించే ఆవిష్కరణాత్మక పరిశోధనలు చేపట్టాలి: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్

రాజేంద్రనగర్ ఐసీఏఆర్-ఐఐఆర్ఆర్‌లో రైతు దినోత్సవం, పీఎం-కిసాన్ ఉత్సవ్ దివస్

వ్యవసాయ దిగుబడిని పెంపొందించే ఆవిష్కరణాత్మక పరిశోధనలు చేపట్టాలి: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్
Share Short Clip Download PDF

రాజేంద్రనగర్ ఐసీఏఆర్-ఐఐఆర్ఆర్‌లో రైతు దినోత్సవం, పీఎం-కిసాన్ ఉత్సవ్ దివస్

హైదరాబాద్, 2026 అక్టోబర్ 30(రైట్స్ మీడియా): పర్యావరణాన్ని, మానవ ఆరోగ్యాన్ని కాపాడుతూనే రైతులు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించేలా వినూత్న ఆలోచనలు, మెరుగైన సాగు పద్ధతులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కొత్త వంగడాలను అభివృద్ధి చేయాలని వ్యవసాయ పరిశోధకులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు.

హైదరాబాద్ రాజేంద్ర నగర్‌లోని ఐసీఏఆర్–భారత వరి పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్–ఐఐఆర్ఆర్)లో నిర్వహించిన రైతు దినోత్సవాలకు ముఖ్యఅతిథిగా మంత్రి హాజరయ్యారు. పీఎం-కిసాన్ పథకం 24వ విడత నిధులు విడుదలైన నేపథ్యంలో పీఎం-కిసాన్ ఉత్సవ్ దివస్‌ను కూడా ఈ సందర్భంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ

ప్రధానమంత్రి దార్శనికత అయిన వికసిత్ భారత్–2047 సాధనలో రైతులు ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారని అన్నారు. తెలంగాణలో కీలకమైన సంస్థ అయిన ఐసీఏఆర్ వ్యవసాయ పరిశోధనా రంగంలో విశేష సేవలందిస్తోందని కొనియాడారు. రైతులు మరింత సమర్థంగా పంటలు సాగు చేసేందుకు, పంట నష్టాలను తగ్గించుకునేందుకు ఐసీఏఆర్ లాంటి పరిశోధన సంస్థలు కొత్త వంగడాలను అభివృద్ధి చేస్తున్నాయన్నారు.

దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లు, ఒత్తిడి పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. వారి సమస్యలను పరిష్కరించేందుకు పరిశోధనలను, ఆవిష్కరణలను నిరంతరం కొనసాగించాల్సిన అవసరం ఉందని మంత్రి స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ

రైతులకు ఆర్థిక సాయాన్ని అందించడంలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం–కిసాన్) పోషిస్తున్న పాత్ర గురించి వివరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను అర్హులైన లబ్ధిదారులకు అందేలా చూడాలన్నారు.

ఐసీఏఆర్–ఐఐఆర్ఆర్ శాస్త్రవేత్తలు, పరిశోధకుల సలహాలను, సూచనలను పాటించాలని రైతులకు మంత్రి సూచించారు. ఉత్పాదకతను, దిగుబడులను పెంచుకోవడానికి శాస్త్రీయ మార్గదర్శకాలు, మెరుగైన సాగు పద్ధతులను అనుసరించాలని స్పష్టం చేశారు.
ఐసీఏఆర్–ఐఐఆర్ఆర్ డైరెక్టర్ డాక్టర్ ఎం శ్రీనివాస్ ప్రసాద్ ప్రారంభోపన్యాసం చేశారు.

వ్యవసాయ దిగుబడిని పెంపొందించే ఆవిష్కరణాత్మక పరిశోధనలు చేపట్టాలి: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్

వ్యవసాయ దిగుబడిని, పంట ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని పెంచడంలో రైతుకు తోడ్పడేలా సంస్థ చేపడుతున్న పరిశోధన కార్యక్రమాల గురించి వివరించారు.

అనంతరం శాస్త్రవేత్తలతో రైతులు ముచ్చటించారు. ఇందులో భాగంగా ఐసీఏఆర్–ఐఐఆర్ఆర్ శాస్త్రవేత్తలు కొత్తగా అభివృద్ధి చేసిన వరి వంగడాలతో పాటు పలు నూతన ఆవిష్కరణలను ప్రదర్శించారు. క్రిమిసంహారక మందుల సరైన వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులు అడిగిన సందేహాలకు సమాధానాలిచ్చారు.

ప్రకృతి ఎన్విరాన్మెంట్ సొసైటీ (పీఈఎస్) ఎన్జీవో ప్రతినిధి శ్రీమతి జయశ్రీ, ఐసీఏఆర్–ఐఐఆర్ఆర్ డైరెక్టర్ డాక్టర్ ఎం శ్రీనివాస్ ప్రసాద్, ఐసీఏఆర్–ఐఐఆర్ఆర్ సంస్థకు చెందిన ఇతర ప్రతినిధులు, సుమారు 200 మంది రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వ్యవసాయ దిగుబడిని పెంపొందించే ఆవిష్కరణాత్మక పరిశోధనలు చేపట్టాలి: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్