ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ చీఫ్ కోఆర్డినేటర్, బీహార్లోని పాట్నాకు చెందిన ఆచార్య అనిల్ కుమార్ ఠాకూర్ కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె. ప్రతాప్ రెడ్డిని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్థికశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో డిసెంబర్లో నిర్వహించనున్న 109వ ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ వార్షిక జాతీయ సదస్సు నిర్వహణకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఆర్థికశాస్త్ర విభాగాధిపతి, సామాజిక శాస్త్రాల విభాగాల డీన్, దూరవిద్యా కేంద్రం సంచాలకులు, పాలకమండలి సభ్యులు ఆచార్య బి. సురేష్ లాల్ తదితరులు పాల్గొన్నారు.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
జిల్లా వార్తలు
కేయూ వీసీని కలిసిన ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ చీఫ్ కోఆర్డినేటర్
News URL: https://rightsmedia.in/news/indian-economic-association-chief-coordinator-meets-ku-vc