ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24 గంటల పాటు మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి వైద్యులు, సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం హనుమకొండ జిల్లా హసన్‌పర్తిలోని ఉన్నతశ్రేణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వ్యాక్సిన్ గది, ఆపరేషన్ థియేటర్, ఇన్‌పేషెంట్ గది, సిబ్బంది గది, నర్సుల గది, ఇంజక్షన్ రూమ్, ల్యాబొరేటరీ, ఫార్మసీ, టాయిలెట్స్, తదితర విభాగాలను కలెక్టర్ పరిశీలించారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చిన రోగులను కలిసి వారు ఏ సమస్యతో వైద్య సేవల కోసం వచ్చారో కలెక్టర్ ఆరా తీశారు. అక్కడ అందుతున్న వైద్య సేవలు, మందుల లభ్యత, సిబ్బంది స్పందన,తదితర వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను పరిశీలించి, వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది వివరాలను మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భార్గవ్ ను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్య సేవలను అందించాలి
హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి.
హనుమకొండ జిల్లా హసన్ పర్తి లోని ఉన్నత శ్రేణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ..
ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్య సేవలతో పాటు నిర్వహణ పటిష్టంగా ఉండేలా చూసుకోవాలన్నారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు అవసరమైన వైద్య సేవలను సకాలంలో అందించాలని వైద్యులు,సిబ్బందికి సూచించారు. ఆరోగ్య కేంద్రంలో పనిచేసే సిబ్బంది అందుబాటులో ఉండేలా షిఫ్ట్‌ల వారీగా విధులు కేటాయించాలని, ప్రతి షిఫ్ట్‌లో అవసరమైన సిబ్బంది తప్పనిసరిగా విధుల్లో ఉండేలా పర్యవేక్షించాలని వైద్యాధికారిని ఆదేశించారు. హాస్పిటల్ నిర్వహణ పక్కాగా ఉండాలని. రోగులకు మెరుగైన వైద్యం, పరిశుభ్రమైన వాతావరణం, అవసరమైన మౌలిక సదుపాయాలు అందేలా చర్యలు చేపట్టాలన్నారు.