Friday, 18 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు వేగవంతం కావాలి: జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్

అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు వేగవంతం కావాలి: జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్
Share Short Clip Download PDF

గ్రామస్థాయిలో చేపడుతున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలు నిర్దేశిత గడువులోగా పూర్తయ్యేలా మండల పరిషత్ అభివృద్ధి అధికారులు (ఎంపీడీవోలు) నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీడీవోలు, సంబంధిత అధికారులతో వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..

అర్హులైన పేదలకు అందించే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం మరియు రెండు పడకల గదుల (2 BHK) ఇండ్ల పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు ఎలాంటి సాంకేతిక, నిధుల సమస్యలు రాకుండా క్షేత్రస్థాయి పరిశీలన జరపాలన్నారు.
రెండు పడకల గదుల నిర్మాణం కోసం ఇప్పటికే వివరాలను సమర్పించడం జరిగిందని అట్టి వాటి విచారణ చేసి ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు.

విబిజె రామ్జి పథకం (VBJ-RAMG Scheme):

వీబీజీ రామ్‌జీ పథకం అమలుతీరును నిరంతరం పర్యవేక్షిస్తూ, నిర్దేశించుకున్న లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలన్నారు,
పామ్ ఫాంట్ (ఫామ్ పాండ్ / పొలం కుంట) నీటి కుంటల నిర్మాణం వల్ల రైతులకు అనేక ఆర్థిక మరియు పర్యావరణ ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో ఇవి చాలా సహాయపడతాయి.

ప్రధాన ఉపయోగాలు మరియు లాభాలు:

నీటి లభ్యత మరియు పంట రక్షణ: వర్షపు నీటిని నిల్వ చేయడం వల్ల వర్షాభావ సమయంలో లేదా అత్యవసర పరిస్థితిలో పంటలకు నీటిని అందించి పంట నష్టపోకుండా కాపాడుకోవచ్చు.

భూగర్భ జలాలు పెరుగుదల: ఈ కుంటల వల్ల చుట్టుపక్కల బావులు, బోరు బావులలో నీటి మట్టం గణనీయంగా పెరుగుతుంది.

అదనపు ఆదాయంచేపల పెంపకం: పొలం కుంటలలో చేపలు లేదా రొయ్యల పెంపకం చేపట్టి అదనపు ఆదాయం పొందవచ్చు.గట్లపై పంటలు: కుంట గట్ల మీద కూరగాయలు, పండ్ల చెట్లు లేదా పశువుల మేత పెంచవచ్చు.మట్టి కోత నివారణ: వర్షపు నీరు వేగంగా కొట్టుకుపోకుండా ఆపడం వల్ల విలువైన ఉపరితల సారవంతమైన మట్టి కొట్టుకుపోకుండా ఉంటుంది.

విద్యుత్ సమస్యల నుండి ఉపశమనం: వర్షపు నీటిని నేరుగా కాలువల ద్వారా పంటలకు అందించడం వల్ల విద్యుత్ బోర్లపై ఆధారపడటం తగ్గుతుంది.

ప్రభుత్వ సహాయం, ఉద్యానవన శాఖల ద్వారా పొలం కుంటల నిర్మాణానికి ప్రభుత్వం ఆర్థిక సబ్సిడీలను అందిస్తోంది. మీ సమీప మండల వ్యవసాయ అధికారి (AO) లేదా వ్యవసాయ విస్కరణ అధికారి (AEO)ని సంప్రదించి సబ్సిడీ వివరాలు తెలుసుకోవచ్చన్నారు.
గ్రామస్థాయిలో పచ్చదనం పరిశుభ్రత స్వచ్ఛభారత్ పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ, వ్యక్తిగత మరియు సమాజిక మరుగుదొడ్ల (టాయిలెట్స్) నిర్మాణం, వినియోగంపై దృష్టి సారించాలన్నారు.
ఉద్యానవన పంటల సాగు: వ్యవసాయంతో పాటు పామ్ ఆయిల్, ఇతర కూరగాయలు, ఉద్యానవన (హార్టికల్చర్) పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచేలా పంట మార్పిడి విధానం వైపు రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.
వికసిత్ భారత్ – జీ రామ్ జీ (VB-G RAM G) పథకం (గతంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం - MGNREGA) ద్వారా గ్రామీణాభివృద్ధి, కమ్యూనిటీ అవసరాల కోసం వివిధ రకాల శాశ్వత భవనాలు మరియు మౌలిక సదుపాయాల నిర్మాణాలు చేపడతారు.
పథకం కింద నిర్మించే భవనాలు, గ్రామ పంచాయతీ & పరిపాలనా, గ్రామ పంచాయతీ భవనాలు (పంచాయితీ సచివాలయాలు), విలేజ్ నాలెడ్జ్ సెంటర్లు (గ్రామ సమాచార / సాంకేతిక కేంద్రాలు), గ్రామ సమైక్య / పొదుపు సంఘాల (SHG) భవనాలు, ఆరోగ్యం & శిశు సంక్షేమ అంగన్‌వాడీ కేంద్రాల భవనాలు, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు) వ్యవసాయ & గ్రామీణ జీవనోపాధి రైతు సేవా కేంద్రాలు / రైతు భరోసా కేంద్రాలు, ధాన్యం నిల్వ చేసుకునే గోదాములు, మత్స్య సంపద నిల్వ లేదా చేపల విక్రయ షెడ్లు, పశువుల షెడ్లు (కమ్యూనిటీ డెయిరీ, పారిశుధ్యం & వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ / సేకరణ కేంద్రాలు, సంపద తయారీ కేంద్రాలు గ్రామాల్లో కొనసాగుతున్న ఇతర పనులను వేగవంతం చేసి, పనుల నాణ్యతలో రాజీ పడకుండా చూడాలని, మండల స్థాయిలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి గ్రామ స్థాయి వరకు సభలు నిర్వహించి ఈ పథకం ద్వారా గ్రామ పంచాయతీ భవనాలు, పశు వైద్యశాలలు, తదితర అన్ని ప్రభుత్వ భవనాల నిర్మాణం కోసం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ప్రజాసంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులందరికీ త్వరగా చేరేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ సూచించారు.

డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్, జెడ్పి సీఈవో క్షేత్రస్థాయిలో మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో నిత్యం సమీక్షలు సమావేశాలు నిర్వహించి గ్రామస్థాయిలో ప్రభుత్వం ప్రవేశపెట్టి కొనసాగిస్తున్న అన్ని పథకాలను అర్హులైన ప్రజలందరికీ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని,
ఎంపీడీవోలు పంచాయితీ కార్యదర్శుల ద్వారా నిత్యం గ్రామాలలో అమలు పరుస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై సమీక్షలు సమావేశాలు నిర్వహించి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో (ఇన్చార్జి) అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు, హౌసింగ్ పిడి, జెడ్పి సీఈవో పురుషోత్తం, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మధుసూదన రాజు, పశు వైద్య అధికారి డాక్టర్ కిరణ్ కుమార్, డిపిఓ రేవంత్, వ్యవసాయ శాఖ అధికారి విజయచంద్ర, ఉద్యానవన శాఖ అధికారి జి.మరియన్న, వివిధ మండలాల ఎంపీడీవోలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.