వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో ఈ నెల 23న నిర్వహించిన ' కల్లెడ చెస్ టోర్నమెంట్' లో మహబూబాబాద్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినులు విశేష ప్రతిభను కనబరచి పలు బహుమతులు సాధించారని ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి నేడు ఒక ప్రకటనలో తెలిపారు.

విజేతలుగా నిలిచిన విద్యార్థులలో రెండవ స్థానంలో (ఓవరాల్‌) దిలీషా –8 వేల రూపాయల నగదు బహుమతి, నాలుగవ స్థానంలో శ్రీ లాస్య –2 వేల రూపాయల నగదు బహుమతి, ఐదవ స్థానంలో దక్షణిక 2 వేల రూపాయల నగదు బహుమతి నిలిచారు.

విజేతలుగా నిలిచిన విద్యార్థినులను, వారికి శిక్షణ అందించిన చెస్ కోచ్ జి. జ్యోత్స్నను జోనల్ ఆఫీసర్లు పి. అప్పారావు,అపర్ణ, వైస్ ప్రిన్సిపాల్ విజయ కుమారి, ఉపాధ్యాయులు వాణి ప్రియాంక, పిఇటి శ్రీదేవి మరియు పాఠశాల సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు.