తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రకటించారు.
తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రకటించారు. న్యాయస్థానాల ఆదేశాలను తాను ఎల్లప్పుడూ గౌరవిస్తానని స్పష్టం చేశారు. ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు కోర్టు పేర్కొన్న నేపథ్యంలో.. ఉపఎన్నిక వస్తే ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని దానం నాగేందర్ ప్రకటించారు. నియోజకవర్గ ప్రజలే తన బలమని, ఏ ఎన్నిక వచ్చినా ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ భారీ మెజారిటీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. గతంలోనూ ఎన్నో రాజకీయ సవాళ్లను ఎదుర్కొన్నానని, ప్రజలకు సేవ చేయడమే తన ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. హైకోర్టు తీర్పు తాలూకు పూర్తి వివరాలు పరిశీలించిన తర్వాత న్యాయ నిపుణులతో చర్చించి, భవిష్యత్ కార్యాచరణపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన లేదని అన్నారు.
హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్