పర్యావరణం, వాతావరణ మార్పుల భవిష్యత్తుపై న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ప్రారంభించనున్నారు.

పర్యావరణం, వాతావరణ మార్పుల భవిష్యత్తుపై న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఈ సదస్సు కొనసాగనుంది. ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.

ఈ సదస్సుకు దేశంలోని సుప్రీంకోర్టు, హైకోర్టులు, జిల్లా కోర్టుల న్యాయమూర్తులతో పాటు వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, పర్యావరణ నిపుణులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు. వీరితో పాటు ప్రపంచవ్యాప్తంగా 17 దేశాలకు చెందిన ప్రముఖ న్యాయమూర్తులు, న్యాయశాఖ ప్రతినిధులు ఈ వేదికపైకి వచ్చారు.

న్యాయపరమైన విధానాలు, శాస్త్రీయ విజ్ఞానం, పర్యావరణ నిర్వహణ పద్ధతులను పరస్పరం పంచుకునేందుకు ఈ సదస్సు ఒక చక్కటి వేదికగా నిలుస్తోందని నిర్వాహకులు తెలిపారు. పర్యావరణం మరియు వాతావరణ మార్పులకు సంబంధించిన విధానాల రూపకల్పనలో ఎదురవుతున్న సవాళ్లు, వాటి అమలు, పర్యావరణ పరిరక్షణ వ్యవస్థలను మరింత బలోపేతం చేయడంపై సదస్సులో విస్తృతంగా చర్చిస్తున్నారు.