Thursday, 17 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
క్రైమ్ న్యూస్

గచ్చిబౌలిలో ఘోర ప్రమాదం.. కూలిన ఐదంతస్తుల భవనం

గచ్చిబౌలిలో ఘోర ప్రమాదం.. కూలిన ఐదంతస్తుల భవనం
Share Short Clip Download PDF

హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌ పరిధిలోని అంజయ్యనగర్‌లో నిర్మాణంలో ఉన్న ఓ ఐదంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. భవనం కూలి భారీ శబ్ధం రావడంతో భయపడిపోయిన స్థానిక జనాలంతా అక్కడి నుంచి దూరంగా పరుగులు పెట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఘోర ప్రమాదం జరిగింది. అంజయ్యనగర్‌లో నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలిపోవడంతో ఓ వ్యక్తి మరణించగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది గాయపడిన వ్యక్తిని హాస్పిటల్‌కు తరలించారు.

వివరాల్లోకి వెళ్తే..

అంజయ్యనగర్‌లో నాలను అనుకుని అక్రమంగా తక్కువ స్థలంలో ఓ వ్యక్తి ఏడు అంతస్తులతో ఓ భవన నిర్మాణం చేపట్టారు. కేవలం 50 గజాల స్థలంలోనే దాదాపు ఏడు అంతస్థుల నిర్మాణం చేపట్టారు. దీంతో భవన నిర్మాణం పూర్తి కాకుండానే అది కుప్పకూలింది. శనివారం మధ్యాహ్నం సరిగ్గా ఒంటి సమయంలో నిర్మాణంలో ఉన్న ఆ భవనం ఒక్కసారిగా కూలిపోయింది. యజమాని అత్యాశకు పక్కనే ఉన్న నిర్మాణాలు సైతం పాక్షికంగా కూలిపోయాయి. నిర్మాణంలో ఉన్న భవనం కూలి పక్కనే వైట్ ఫీల్డ్‌ రోడ్డులో ఉన్న మరో అపార్ట్మెంట్ పై పడిపోయింది. దీంతో ఆ భవనం సైతం దెబ్బతిన్నది. భవనం కూలినప్పుడు వచ్చి భారీ శబ్ధం విని స్థానికి జనాలు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి కూడా మరణించిచగా.. రమణారెడ్డి అనే వ్యక్తి గాయపడినట్టు సమాచారం.
ఇక ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా? అని తెలుసుకునేందుకు వాటిని తొలగిస్తున్నారు.