Thursday, 17 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

భారతీయ భాషలకు వారధిగా హిందీ దోహదపడుతుంది: డీఐఈఓ డా.శ్రీధర్ సుమన్

నర్సంపేటలోని మైనారిటి కళాశాలలో ఘనంగా హిందీ దినోత్సవం.

భారతీయ భాషలకు వారధిగా హిందీ దోహదపడుతుంది: డీఐఈఓ డా.శ్రీధర్ సుమన్
Share Short Clip Download PDF

భారత దేశంలోని పలు భాషలకు వారధిగా, విభిన్న భాషా ప్రాంతాల్లో ప్రజల ఐకమత్యానికి హిందీ భాష దోహదపడుతుందని జిల్లా మాధ్యమిక విద్యాధికారి డా.శ్రీధర్ సుమన్ అన్నారు. మంగళవారం నర్సంపేటలోని మైనారిటీ బాలికల కళాశాలలో నిర్వహించబడిన హిందీ దినోత్సవంలో పాల్గొని కీలకోపన్యాసం చేసారు.

ఈ సందర్భంగా డీఐఈఓ మాట్లాడుతూ..

కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సమాచారాన్ని చేరవేసే వేదిక హిందీ అని అన్నారు. ఉత్తర భారతంలోని ఆర్య భాషలను, దక్షిణ ప్రాంతంలోని ద్రవిడ భాషల ప్రజల్లో ఐకమత్యంకోసమే మహాత్మా గాంధీ గారు దక్షిణ భారత హిందీ ప్రచార సభను ప్రారంభించారని గుర్తు చేసారు. సంస్కృతం నుండి పుట్టిన అత్యాధునిక భాషగా హిందీ, వంద కోట్ల ప్రజల జన-మానస భాషగా ప్రాచుర్యం సంపాదించుకుందని అన్నారు. జాతీయోద్యమ కాలంలో కవుల రచనల వల్ల ప్రజలను ఏకతాటిపై చేర్చిన గొప్పతనం హిందీ భాష కుందని అన్నారు. రంగురంగుల మణిహారంలో కనిపించని దారంలా హిందీ భాష ప్రజలందరిని ఏకత్రాటిపై నడిపుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేసారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీపాల, హిందీ ఉపాధ్యాయురాలు,ఉపాధ్యాయులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డీఐఈఓ మాట్లాడుతూ..