కాకతీయ విశ్వవిద్యాలయం 24వ స్నాతకోత్సవం నవంబర్ 28, 2026న నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య రాజేందర్ కట్ల తెలిపారు. 2025 జూలై 1 నుంచి 2026 అక్టోబర్ 31 వరకు పీహెచ్‌డీ పట్టా పొందిన వారు, 24వ స్నాతకోత్సవంలో స్వయంగా పీహెచ్‌డీ పట్టా స్వీకరించదలచిన వారు నవంబర్ 15, 2026లోపు ఆన్‌లైన్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. పీహెచ్‌డీ పట్టా స్వీకరణకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు www.kuonline.co.in ద్వారా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పరీక్షల నియంత్రణాధికారి తెలిపారు.