Friday, 18 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
తెలంగాణ

22ఎ ఎక్స్ టెంట్ లో తేడాలు వస్తే వాటిని భూభారతి పోర్టల్ లోనే పరిష్కరించాలి

--రాష్ట్ర రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్.

22ఎ ఎక్స్ టెంట్ లో తేడాలు వస్తే వాటిని భూభారతి పోర్టల్ లోనే పరిష్కరించాలి
Share Short Clip Download PDF

రాష్ట్రంలోని భూభారతి, 22-ఏ, సమగ్ర రీసర్వే చేసేందుకు నిర్దేశించిన అంశాల పై గురువారం రాష్ట్ర రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ వీసీ కి హనుమకొండ జిల్లా కలెక్టరెట్ లోని వీసీ హల్ నుండి కలెక్టర్ చాహత్ బాజ్ పాయి హాజరయ్యారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్ మాట్లాడుతూ.....

భూభారతి డాటా ఆధారంగా ఎక్కడైనా 22 ఎ ఎక్స్ టెంట్ లో తేడాలు వస్తే వాటిని భూభారతి పోర్టల్ లోనే పరిష్కరించాలని సూచించారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల్లో 22a కింద నమోదు అయినట్లు ఉంటే వాటిని గుర్తించి నిర్ణీత ప్రొఫార్మాలో తాసిల్దార్ ల నుంచి సేకరించి నివేదిక సమర్పించాలని కలెక్టర్లను సూచించారు. ఇందుకోసం స్టాండర్డ్ ఆపరేషన్ సిస్టం అమలు చేయాలని తెలియజేశారు. ఎస్ఆర్ఓ లో వచ్చిన ఫిర్యాదులను ఏరోజుకారోజు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అదేవిధంగా ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంచుకొని ఆ గ్రామంలో సమగ్రంగా భూ రీసర్వే నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని వాటి సత్ఫలితాల ఆధారంగా అన్ని గ్రామాల్లో రీ-సర్వే చేయాల్సి ఉంటుందని తెలియజేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు.

22ఎ ఎక్స్ టెంట్ లో తేడాలు వస్తే వాటిని భూభారతి పోర్టల్ లోనే పరిష్కరించాలి