కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం చెల్పూర్ గ్రామంలో 'చంద్ర శివ యూత్' ఆధ్వర్యంలో 20వ సంవత్సరం బాల వినాయక నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఐదవ రోజు సందర్భంగా స్వామివారికి విశేష పూజలతో పాటు, మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకల్లో బీసీ ఆజాద్ ఫెడరేషన్ డివిజన్ అధ్యక్షుడు పంజాల తిరుపతి గౌడ్ కుటుంబ సమేతంగా పాల్గొని, విఘ్నేశ్వరునికి పంచామృతాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 20 ఏళ్లుగా నిర్విరామంగా గణపయ్య సేవలో తరిస్తూ, యువతను ధర్మమార్గంలో నడిపిస్తున్న 'చంద్ర శివ యూత్' సభ్యుల సేవలను ప్రత్యేకంగా కొనియాడారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు, అన్న వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.