హైదరాబాద్ గచ్చిబౌలి పరిధిలోని గోపన్పల్లిలో నాలుగు అంతస్తుల భవనం ప్రమాదకరంగా ఒక వైపునకు ఒరిగింది. కేవలం 30 చదరపు గజాల చిన్న విస్తీర్ణంలోనే ఎలాంటి పునాది భద్రత లేకుండా నాలుగంతస్తుల నిర్మాణాన్ని నిర్వాహకులు చెపట్టారు. భవనం ఎప్పుడు కూలిపోతుందోనన్న భయంతో అప్రమత్తమైన అధికారులు, చుట్టుపక్కల నివాసితులను ఖాళీ చేయించారు.