Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
రాష్ట్రాలు

ఎన్‌టిఆర్ భవన్‌లో ఘనంగా మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు

⏩సత్యం, అహింసలతో దేశానికి స్వాతంత్య్రం అందించిన మహానీయుడు గాంధీజీ: టిడిపి పొలిట్‌‌బ్యూరో సభ్యులు అరవింద్ కుమార్‌గౌడ్.

ఎన్‌టిఆర్ భవన్‌లో ఘనంగా మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు
Share Short Clip Download PDF

హైదరాబాద్ (రైట్స్ మీడియా): హైదరాబాద్‌‌లోని ఎన్‌టిఆర్ భవన్‌లో శుక్రవారం తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ 157వ జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి 122వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు అరవింద్ కుమార్‌గౌడ్ మాట్లాడుతూ..

సత్యం, అహింస అనే రెండు ఆయుధాలతో బ్రిటిష్ వారి ఆయుధ బలాన్ని ఎదుర్కొని భారత్‌కు స్వాతంత్య్రాన్ని సాధించిపెట్టిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ అని కొనియాడారు. సహాయ నిరాకరణ, ఉప్పు సత్యాగ్రహం వంటి ఉద్యమాల ద్వారా దేశ స్వాతంత్య్రం కోసం తన జీవితాన్ని అర్పించారని గుర్తుచేశారు. గాంధీజీ ఆకాంక్షించిన సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువల బాటలోనే ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ పయనిస్తోందని ఆయన స్పష్టం చేశారు.

కేంద్రంలో వాజ్‌పేయి ప్రధానమంత్రి కావడం మరియు అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఎన్నికవ్వడంలో టిడిపి కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబులకు ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు వచ్చినా, తెలుగు ప్రజలకు సేవ చేయడానికే ప్రాధాన్యత ఇచ్చారని వివరించారు. లాల్‌బహదూర్ శాస్త్రి గారు రైల్వే ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లో అత్యున్నత విలువలు నెలకొల్పారని కొనియాడారు.

ఎన్టీఆర్, చంద్రబాబుల పాలనలో వేసిన బలమైన పునాదుల వల్లే నేడు తెలంగాణ ఆర్థికంగా ముందుందని, రాష్ట్రంలో మళ్లీ సామాజిక న్యాయం సిద్ధించాలన్నా, ఆర్థిక పురోగతి సాధించాలన్నా తెలుగుదేశం పార్టీ రాజకీయంగా బలపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని అరవింద్ కుమార్‌గౌడ్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు అజ్మీరా రాజునాయక్, సూర్యదేవర లత, యానాల అనంతరెడ్డి, సంధ్యపోగు రాజశేఖర్, సుభాషిణి, ఎం.వి.పి రమేష్ బాబు, కృష్ణవేణి రెడ్డి, ఎబిఆర్ మోహన్‌రావు, నర్సింగ్‌రావు, బాలాజీ గోస్వామి, నర్సింహులు, రామన్న గౌడ్, రాజు, సలీం తదితరులు పాల్గొన్నారు.
--తెలుగుదేశం ప్రకాశ్ రెడ్డి.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు అరవింద్ కుమార్‌గౌడ్ మాట్లాడుతూ..
ఎన్‌టిఆర్ భవన్‌లో ఘనంగా మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు

Source / reference: -తెలుగుదేశం ప్రకాశ్ రెడ్డి.