కాకతీయ విశ్వవిద్యాలయం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్టడీస్ సెంటర్ సౌజన్యంతో, హైదరాబాద్ విష్ణు IAS అకాడమీ సహకారంతో ఎస్ఐ (SI), కానిస్టేబుల్ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఆదివారం (సెప్టెంబర్ 20) ఉచిత మాక్ టెస్ట్ నిర్వహించనున్నట్లు స్టడీస్ సెంటర్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ పుల్లా శ్రీనివాస్ తెలిపారు. ఈ మాక్ టెస్ట్ ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు కాకతీయ విశ్వవిద్యాలయంలోని డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ భవనంలోని కౌన్సిలింగ్ హాల్‌లో నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులందరూ తప్పనిసరిగా మాక్ టెస్ట్ కు హాజరుకావాలని ఆయన కోరారు. మాక్ టెస్ట్ ద్వారా అభ్యర్థులకు అసలు పోటీ పరీక్ష విధానంపై స్పష్టమైన అవగాహన కలగడంతో పాటు సమయపాలన, ప్రశ్నలను వేగంగా పరిష్కరించే సామర్థ్యం మెరుగుపడుతుందని తెలిపారు. ఎస్ఐ, కానిస్టేబుల్ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఈ ఉచిత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ పుల్లా శ్రీనివాస్ సూచించారు.
ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత మాక్ టెస్ట్
⏩కాకతీయ విశ్వవిద్యాలయం అంబేద్కర్ స్టడీస్ సెంటర్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ పుల్లా శ్రీనివాస్.