Sunday, 20 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

రోగుల భద్రత–నాణ్యమైన వైద్య సేవలే ధ్యేయం

⏩డా. డి. రామారావు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య ఆరోగ్యశాఖ అధికారి, ఖమ్మం.

రోగుల భద్రత–నాణ్యమైన వైద్య సేవలే ధ్యేయం
Share Short Clip Download PDF

ఖమ్మం రూరల్ / ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని పాలేరు నర్సింగ్ & మెడికల్ కాలేజీలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ‘పేషెంట్ సేఫ్టీ వీక్’ (సెప్టెంబర్ 14 నుంచి 20 వరకు), 'వరల్డ్ స్నేక్ బైట్ అవేర్‌నెస్ డే' అవగాహన సదస్సు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఖమ్మం జిల్లా వైద్య మరియు ఆరోగ్య ఆరోగ్యశాఖ అధికారి డా. డి. రామారావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డా. రామారావు మాట్లాడుతూ..

రోగుల భద్రత – నిరంతర పర్యవేక్షణ ఆసుపత్రుల్లో సరైన రోగ నిర్ధారణ (Correct Diagnosis), సురక్షితమైన మందుల పంపిణీ (Safe Medication), ఇన్‌ఫెక్షన్ల నియంత్రణ (Infection Prevention) వంటి అంశాల్లో సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలి అని,రోగులు, వారి బంధువులు కూడా తమకు అందుతున్న వైద్య చికిత్స, మందుల వివరాలపై అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. పాముకాటు – అపోహలు వీడాలి, ప్రాణాలు కాపాడాలి గ్రామీణ, గిరిజన ప్రాంత ప్రజల్లో పాముకాట పట్ల మూఢనమ్మకాలు, అపోహలను వీడాలని DM&HO సూచించారు. తక్షణమే ప్రథమ చికిత్స (First Aid)ll బాధితుడిని కంగారు పడకుండా ప్రశాంతంగా ఉంచాలి, కాటు వేసిన శరీర భాగాన్ని వీలైనంత కదలకుండా స్థిరంగా ఉంచాలి, శరీరానికి ఉన్న గాజులు, ఉంగరాలు, బిగుతైన బట్టలను వెంటనే తొలగించాలి అని, ఏమాత్రం ఆలస్యం చేయకుండా 108 లేదా ఇతర వాహనాల ద్వారా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని, గాయం వద్ద బ్లేడులతో కోయడం, విషాన్ని నోటితో పీల్చడం చేయకూడదు అని,రక్త ప్రసరణ ఆగిపోయేలా గట్టిగా తాడు లేదా వస్త్రంతో కట్లు (Tourniquets) కట్టరాదు అని, మంత్రాలు, తాయెత్తులు, నాటు వైద్యం పేరుతో విలువైన కాలాన్ని వృధా చేయకూడదు అని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా ‘యాంటీ-స్నేక్ వెనమ్’ (ASV)జిల్లా కేంద్ర ప్రధాన ఆసుపత్రితో పాటు ఖమ్మం జిల్లాలోని అన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (CHC), ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (PHC) పాముకాటు విరుగుడు ఇంజెక్షన్లు (Anti-Snake Venom - ASV) ఉచితంగా అందుబాటులో ఉన్నాయని DM&HO తెలిపారు. వర్షాకాలంలో పొలాల్లో పనులకు వెళ్లే రైతులు, కూలీలు గమ్ బూట్లు ధరించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో పాలేరు మెడికల్ & నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్, వైద్య అధ్యాపకులు, వైద్యులు, పారామెడికల్ సిబ్బంది మరియు నర్సింగ్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రోగుల భద్రత–నాణ్యమైన వైద్య సేవలే ధ్యేయం