విశాఖపట్నంలో ఒక అంతర్జాతీయ స్థాయి ప్రయివేటు ఆసుపత్రి నిర్మాణానికి ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఈ రోజు శంకుస్థాపన చేశారు. జిల్లాలోని ఆనందపురం మండలం ఎండాడలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, విశాఖలో ఈ ఆసుపత్రి ఏర్పాటుతో దశలవారీగా ఐదేళ్లలో రెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడి రానుందని, సుమారు తొమ్మిది వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. వైద్య సేవలు, శిక్షణ, పరిశోధనతో పాటు ఎనిమిది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లలో 50కి పైగా వైద్య ప్రత్యేక విభాగాలను అందుబాటులోకి తీసుకురానున్నారని దీని ద్వారా అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.