వర్ధన్నపేట మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ జంక్షన్ లో వికలాంగుల హక్కుల పోరాట సమితి (VHPS) ఆవిర్భావ దినోత్సవం వేడుకలు వర్ధన్నపేట ఎంఎస్పి మండల అధ్యక్షుడు ముత్యాల మల్లేశం మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు చాడ కరుణాకర్ మాదిగల అధ్యక్షతన నిర్వహించారు.
వారు జెండా ఎగురవేసి ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ వరంగల్ జిల్లా మాజీ అధ్యక్షులు, వర్ధన్నపేట నియోజకవర్గం ఇంచార్జ్ కట్ట రాజశేఖర్ మాదిగ హాజరై మాట్లాడుతూ.. వికలాంగుల హక్కుల కోసం మందా కృష్ణ మాదిగ స్థాపించిన VHPS నిరంతరం పోరాడుతోంది. వికలాంగులకు 5 శాతం రాజకీయ రిజర్వేషన్, ఉద్యోగాల్లో 3 శాతం రిజర్వేషన్ అమలు చేయాలి. ఆసరా పింఛన్ ను రూ.4,016 నుండి రూ.6 వేలకు పెంచాలి. వికలాంగుల సంక్షేమానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి అని డిమాండ్ చేశారు. వికలాంగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోతే రాబోయే రోజుల్లో చలో కలెక్టరేట్, చలో హైదరాబాద్ కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో తుమ్మల స్వరూప, తుమ్మల సునీల్, రవీందర్ రెడ్డి, ఎం ఎస్ పి, ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
వర్దన్నపేట లో ఘనంగా వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవం వేడుకలు
జెండా ఎగురవేసిన నాయకులు - వికలాంగుల హక్కుల కోసం పోరాటం ఆగదన్న నేతలు.