భారత హాకీ దిగ్గజం, హాకీ విజార్డ్ మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకొని జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేజర్ ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భారత హాకీ రంగానికి ఆయన అందించిన సేవలు, దేశానికి సాధించిన విజయాలను స్మరించుకున్నారు. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పెంపొందిస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు. యువత క్రీడల్లో ఆసక్తి పెంచుకొని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. క్రీడాకారులను ప్రోత్సహించడంతో పాటు జిల్లాలో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రీడాకారులను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సంధ్యరాణి, ఆర్డిఓలు వరంగల్ సుమ, నర్సంపేట ఉమారాణి ఒలంపిక్ అసోసియేషన్ సెక్రెటరీ కైలాసం యాదవ్, డి వై ఎస్ ఓ అనిల్ కుమార్, అన్నీ మండలాల తాసిల్దార్లు కొచ్ లు కలక్టరేట్ స్టాఫ్ మరియు క్రీడకారులు పాల్గొన్నారు.
హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్‌కు ఘన నివాళి