నల్లబెల్లి మండల ప్రజల కోసం జనతా ట్రస్ట్ ఆధ్వర్యంలో శంకర ఐ ఫౌండేషన్ ఇండియా, శ్రీ కాంచి కామకోటి మెడికల్ నిర్వహించిన భారీ ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం అయ్యింది.
జనతా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి ఆపరేషన్లు విజయవంతం
ఉచిత కంటి వైద్య శిబిరంలో వందల మంది కంటి పరీక్షలు చేయించుకోగా, వైద్యుల సూచన మేరకు 31 మందికి ఆపరేషన్లు అవసరమని గుర్తించారు. వెంటనే వారిని ప్రత్యేక వాహనంలో హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలించి, అత్యాధునిక పద్ధతిలో విజయవంతంగా కంటి ఆపరేషన్లు నిర్వహించారు. ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేసుకుని, తిరిగి కంటి చూపు పొంది, ఆరోగ్యంగా ఈరోజు నల్లబెల్లికి తిరిగి వచ్చిన 31 మంది లబ్ధిదారులు. గత కొన్ని సంవత్సరాలుగా దృష్టి లోపంతో బాధపడుతూ, ఆర్థిక ఇబ్బందులతో ఆపరేషన్ చేయించుకోలేక ఇంటికే పరిమితమైన 31 మంది బాధితులు ఈ రోజు కంటి వెలుగు పొందిన లబ్ధిదారుల ఆనందం మాటల్లో చెప్పలేనిది! జనతా ట్రస్ట్ వల్లే మాకు మళ్ళీ చూపు వచ్చింది. జనతా ట్రస్ట్ చైర్మన్ డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి జీవితాంతం రుణపడి ఉంటాం" అంటూ కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా జనతా ట్రస్ట్ చైర్మన్ రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ..
పేద, మధ్యతరగతి ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందించడమే మా లక్ష్యం. 31 మంది జీవితాల్లో వెలుగులు నింపడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహిస్తాము" అని తెలిపారు.