ఆరోగ్య ప్రయోజనాల కోసం ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్, టూరిజం నోడల్ అధికారి ఎన్. రవి అన్నారు. శుక్రవారం జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీన ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకొని యోగ కార్యక్రమాన్ని హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి ముఖ్య అతిథిగా హాజరై వివిధ శాఖల అధికారులు, యోగా సాధకులు, విద్యార్థులతో కలిసి యోగాసనాలు వేశారు.
ప్రతి ఒక్కరూ యోగ సాధన చేయాలి: హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి
⏩పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో యోగ కార్యక్రమం.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ రవి మాట్లాడుతూ
ప్రతిరోజు యోగ సాధన చేయడం వలన ఆరోగ్యంగా ఉంటారని, అదేవిధంగా ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి లేకుండా ఉండేందుకు యోగ దోహదపడుతుందన్నారు. యోగ ప్రయోజనాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, ఆయుష్, తదితర శాఖల అధికారులు, సిబ్బంది, వాలంటీర్లు, యోగ సాధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.