Monday, 28 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి: జిల్లా రెవెన్యు అధికారి T.A.V నాగలక్ష్మి

చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి: జిల్లా రెవెన్యు అధికారి T.A.V నాగలక్ష్మి
Share Short Clip Download PDF

మహబూబాబాద్(రైట్స్ మీడియా): తెలంగాణ ప్రభుత్వం మరియు కమిషనర్ బి.సి వెల్ఫేర్ గారు ఇచ్చిన సూచనలు మేరకు గౌరవ జిల్లా కలెక్టర్,మహబూబాబాద్ గారి అనుమతితో శనివారం జిల్లా కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశ మందిరంలో వీరనారి చాకలి ఐలమ్మ గారి జయంతి కార్యక్రమాన్ని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో జిల్లా రెవెన్యు అధికారి T.A.V నాగలక్ష్మి ముఖ్య అతిదిగా పాల్గొని వీరనారి చాకలి ఐలమ్మ గారి చిత్రపటంకు పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్బంగా అధికారి మాట్లాడుతూ,

తెలంగాణ లో చాకలి ఐలమ్మ చేసిన త్యాగాలు చిరస్మరణీయమని, ఆమే చూపిన ధైర్య సాహసాలను మరియు స్పూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని, చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమములో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ది అధికారి CH.సాయిశ్రీజ మరియు వసతి గృహ సంక్షేమ అధికారులు,జిల్లా అధికారులు,IDOC కార్యాలయ సిబ్బంది మరియు జిల్లాలోని రజక సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా అధికారి మాట్లాడుతూ,