పరకాల(రైట్స్ మీడియా): నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. శనివారం పరకాలలో నూతనంగా నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చిన వంద పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి లో ఓపి వైద్య సేవలను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయితో కలిసి ప్రారంభించారు.
మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం: పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి
⏩నూతన ఏరియా ఆసుపత్రితో పరకాల ప్రాంత ప్రజలకు అందుబాటులోకి నాణ్యమైన ప్రభుత్వ వైద్యం: జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి
⏩హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి తో కలిసి పరకాల వంద పడకల ఏరియా ఆసుపత్రిలో వైద్య సేవలను ప్రారంభించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి.
ముందుగా గణపతి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే, కలెక్టర్ అధికారులు పాల్గొనగా అనంతరం ఆసుపత్రిలోనే వైద్యులతో ఎమ్మెల్యే స్వయంగా తన ఆరోగ్య పరీక్షలను చేసుకొని ఓపి సేవలను ప్రారంభించారు. ఆసుపత్రిలో ఫార్మసీ, జనరల్ వార్డు, గైనిక్, ఏఎన్సి , ల్యాబోరేటరీ, ఇతర విభాగాలను శాసనసభ్యులు, కలెక్టర్, వైద్యఅధికారులు ప్రారంభించారు. అనంతరం వైద్యం కోసం వచ్చిన పేషంట్ లకు వైద్యులు వివిధ పరీక్షలను నిర్వహించారు..
అనంతరం నిర్వహించిన సమావేశం లో శాసనసభ్యులు మాట్లాడుతూ...
పరకాలలో నూతనంగా నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చిన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రితో ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే విధంగా మెరుగైన, నాణ్యమైన వైద్య అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. ఆసుపత్రిలో ఓపీ సేవలు అందుబాటులోకి రావడం వల్ల ప్రజలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఏరియా ఆసుపత్రిలో వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. ఆస్పత్రిలో ఇంకా ఏమైనా వైద్య సదుపాయాలు కావాలంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి తగ్గట్టుగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలన్నారు. వైద్యులు, సిబ్బంది ఆసుపత్రిలో వైద్య సేవల నిమిత్తం 24 గంటలు అందుబాటులో ఉండాలన్నారు. వైద్య పరంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించినప్పుడే ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం కలుగుతుందన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా తెలంగాణ లోని ప్రభుత్వ ఆసుపత్రులలో అధునాతన వైద్య సౌకర్యాలను ప్రభుత్వం కల్పించిదన్నారు. వైద్యులందరి సహకారం తో ఆసుపత్రికి A+ కేటగిరి వచ్చేలా అభివృద్ధి చేస్తామన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ...
ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కల్పించిన వైద్య సదుపాయాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆసుపత్రిలో వివిధ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. వైద్యులు కూడా సమయపాలన పాటించి నిరుపేద రోగులకు అందుబాటులో ఉండాలన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ పవన్, ఆర్డీవో డిఎస్ వెంకన్న, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వంశీకృష్ణ, పలువురు ప్రజాప్రతినిధులు, వైద్యులు, సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.