హనుమకొండ (రైట్స్ మీడియా): భారత స్వాతంత్ర్య సమరయోధుడు, అమరవీరుడు షహీద్ భగత్ సింగ్ 119వ జయంతి సందర్భంగా సోమవారం హనుమకొండలోని భగత్ సింగ్ విగ్రహానికి కాంగ్రెస్ రాష్ట్ర యువజన నాయకులు విష్ణు వర్ధన్ రెడ్డి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
భగత్ సింగ్ ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి: కాంగ్రెస్ రాష్ట్ర యువజన నాయకులు విష్ణు వర్ధన్ రెడ్డి
• భగత్ సింగ్ జయంతి సందర్భంగా భగత్ సింగ్ విగ్రహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ రాష్ట్ర యువజన నాయకులు విష్ణు వర్ధన్ రెడ్డి.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
దేశం కోసం 23 ఏళ్ల చిన్న వయసులోనే ప్రాణ త్యాగం చేసిన భగత్ సింగ్ త్యాగం ప్రతి యువతకు స్ఫూర్తిదాయకం. 'ఇంక్విలాబ్ జిందాబాద్' అనే నినాదంతో బ్రిటీష్ పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ధీరుడు భగత్ సింగ్. ఆయన ఆశయాలను, దేశభక్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.
దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల చరిత్రను ఇపుడున్న కేంద్ర ప్రభుత్వం తొక్కిపెడున్నదని, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం లోనే అమరవీరులకు నిజమైన గౌరవం దక్కుతుందని అన్నారు.
భగత్ సింగ్ కలలు కన్న అవినీతి రహిత, బలమైన భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత తదితరులు పాల్గొన్నారు.