Monday, 28 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

రేబిస్ నివారణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి: జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్

• నషా ముక్త్ భారత్‌పై ప్రతిజ్ఞ చేసిన జిల్లా కలెక్టర్, అధికారులు.

రేబిస్ నివారణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి: జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్
Share Short Clip Download PDF

• అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం–2026 పోస్టర్ ఆవిష్కరణ.

ఖమ్మం(రైట్స్ మీడియా): రేబిస్ వ్యాధి నివారణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు.

సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డి లతో కలిసి జిల్లా అధికారులకు నిర్వహించిన రేబిస్ అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ

రేబిస్ వైరస్ వల్ల వచ్చే ప్రాణాంతక వ్యాధి అని, ప్రధానంగా సోకిన జంతువుల కాటు ద్వారా మనుషులకు వ్యాప్తి చెందుతుందని తెలిపారు. సరైన సమయంలో చికిత్స అందకపోతే రేబిస్ మరణానికి దారితీసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పదంగా కనిపించే కుక్కలకు దూరంగా ఉండాలని, పెంపుడు జంతువులకు క్రమం తప్పకుండా రేబిస్ టీకాలు వేయించాలని తెలిపారు.

కుక్క కాటుకు గురైన వెంటనే గాయాన్ని సబ్బు, నీటితో బాగా శుభ్రంగా కడగాలని, అనంతరం ఎలాంటి ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించి రేబిస్ వ్యాక్సిన్ తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. రేబిస్ నివారణకు వ్యాక్సినేషన్ అత్యంత ముఖ్యమైన మార్గమని తెలిపారు. జ్వరం, తలనొప్పి, నీటిని చూసినా లేదా తాగేందుకు ప్రయత్నించినప్పుడు భయం (హైడ్రోఫోబియా), గాలికి భయం (ఏరోఫోబియా), అసహజ ప్రవర్తన వంటి లక్షణాలు రేబిస్‌లో కనిపించే అవకాశం ఉందని వివరించారు.

సెప్టెంబర్ 22 నుంచి 28 వరకు నిర్వహిస్తున్న రేబిస్ అవగాహనా కార్యక్రమాల ద్వారా ప్రజలకు రేబిస్ వ్యాధి, నివారణ చర్యలు, వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. రేబిస్‌ను నివారిద్దాం... ప్రాణాలను కాపాడుకుందాం అనే సందేశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని తెలిపారు.

నషా ముక్త్ భారత్‌పై ప్రతిజ్ఞ :

జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్. తో పాటు అదనపు కలెక్టర్లు, అధికారులు నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రతిజ్ఞ చేశారు. మాదకద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండడంతో పాటు, వాటి దుష్ప్రభావాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.

నషా ముక్త్ భారత్‌పై ప్రతిజ్ఞ :

అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం పోస్టర్ ఆవిష్కరణ :

అనంతరం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం–2026 పోస్టర్‌ను ఆవిష్కరించారు. The Age of Longevity: Rethinking Systems for Longer Lives అనే ఇతివృత్తంతో సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 1 వరకు సీనియర్ సిటిజన్స్ వెల్-బీయింగ్ అండ్ ఎంపవర్‌మెంట్ వీక్–2026 నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

వారోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 24న వారోత్సవాల ప్రారంభం, 25న సీనియర్ సిటిజన్స్ ఆరోగ్యం–సంక్షేమ దినోత్సవం, 26న వృద్ధాశ్రమాల సామర్థ్య నిర్మాణ కార్యక్రమం నిర్వహించారు. సెప్టెంబర్ 28న సైబర్ భద్రత, డిజిటల్ అక్షరాస్యత, వృద్ధులపై వేధింపుల నుంచి రక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించ నున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 29న తరాల మధ్య అనుబంధం–అభ్యసన దినోత్సవం, 30న యాక్టివ్ ఏజింగ్, వెల్‌నెస్, ఇంటర్‌ జెనరేషనల్ వాక్‌థాన్ నిర్వహించనున్నారు.

అక్టోబర్ 1న అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని రాష్ట్ర, జిల్లా స్థాయిలలో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. వృద్ధుల సంక్షేమం, సాధికారతకు సంబంధించిన సహాయం కోసం ఎల్డర్‌లైన్ 14567ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం పోస్టర్ ఆవిష్కరణ :