ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి అర్జీని సంబంధిత శాఖల అధికారులు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో, హనుమకొండ, పరకాల ఆర్డీవో కార్యాలయాలు, ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, అదనపు కలెక్టర్ రవి వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు సమర్పించిన అర్జీలను స్వీకరించారు.
ప్రజావాణిలో వచ్చిన అర్జీల పరిష్కారం పై వెంటనే చర్యలు చేపట్టాలని కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు సమర్పించిన అర్జీలను స్వీకరిస్తూ వారు చెప్పిన వివరాలను కలెక్టర్ తెలుసుకున్నారు.