Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
రాష్ట్రాలు

పచ్చదనం పెంపుతో పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: జిడబ్ల్యుఎంసి కమిషనర్ టీ. వెంకన్న

33వ డివిజన్‌ వినాయక కాలనీలో సామూహిక మొక్కలు నాటే కార్యక్రమం..

పచ్చదనం పెంపుతో పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: జిడబ్ల్యుఎంసి కమిషనర్ టీ. వెంకన్న
Share Short Clip Download PDF

జిడబ్ల్యుఎంసి, అక్టోబర్ 8(రైట్స్ మీడియా): పచ్చదనం పెంపుతో పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిడబ్ల్యుఎంసి కమిషనర్ టీ. వెంకన్న తెలిపారు. గ్రేటర్ వరంగల్ నగరాన్ని పచ్చదనంతో నింపి, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యంగా జీడబ్ల్యూఎంసీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో 33వ డివిజన్‌ వినాయక కాలనీలో గురువారం సామూహిక మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టీ. వెంకన్న పాల్గొని మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ,

పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని సూచించారు. పచ్చదనం పెంపు ద్వారా కాలుష్యాన్ని తగ్గించి, స్వచ్ఛమైన గాలిని అందించే ఆరోగ్యకరమైన వాతావరణాన్ని భవిష్యత్ తరాలకు అందించవచ్చని తెలిపారు. నాటిన మొక్కలను క్రమం తప్పకుండా సంరక్షించాలని, వాటికి అవసరమైన నీటిని అందిస్తూ అవి వృక్షాలుగా ఎదిగేలా చూడాలని సూచించారు. నగరంలో పచ్చదనం పెంపునకు ప్రజలు, భాగస్వామ్యం కీలకమని కమిషనర్ పేర్కొన్నారు.

కార్యక్రమంలో ముఖ్య ఉద్యానవన అధికారి లక్ష్మారెడ్డి, హార్టికల్చర్ అధికారి ప్రశాంత్ కుమార్, మున్సిపల్ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ,
పచ్చదనం పెంపుతో పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: జిడబ్ల్యుఎంసి కమిషనర్ టీ. వెంకన్న