బాన్సువాడ/కామారెడ్డి(రైట్స్ మీడియా): మీడియా రంగం వేగంగా మారుతున్న నేపథ్యంలో ప్రతి జర్నలిస్టు కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను అర్థం చేసుకుని, అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని సీనియర్ జర్నలిస్ట్, సాంకేతిక జర్నలిజం నిపుణుడు ముద్దం నరసింహస్వామి అన్నారు.
కామారెడ్డి జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టుల వృత్తి నైపుణ్యాలను మరింత మెరుగుపరచడంతో పాటు ఆధునిక మీడియా విధానాలపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో, బాన్సువాడలో జర్నలిస్టుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. బాన్సువాడ నియోజకవర్గ కేంద్రంలోని ఎస్.ఆర్.ఎన్.కె. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో టీయూడబ్ల్యూజే సహకారంతో ఈ శిక్షణ తరగతులు జరిగాయి. కార్యక్రమానికి తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి సభాధ్యక్షత వహించగా, ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.