హైదరాబాద్ ( రైట్స్ మీడియా): జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాoచందర్ రావు వారికి ఘనంగా నివాళులర్పించారు. ఇరువురు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం సికింద్రాబాద్ చిలకలగూడ పరిధిలో నిర్వహించిన ‘స్వచ్ఛతా హీ సేవా’ కార్యక్రమంలో పాల్గొని స్వయంగా చీపురు పట్టి పరిసరాలను శుభ్రం చేశారు.
మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా నివాళులర్పించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాoచందర్ రావు
చిలకలగూడలో ‘స్వచ్ఛతా హీ సేవా’ కార్యక్రమంలో పాల్గొన్న రాoచందర్ రావు.
ఈ సందర్భంగా మీడియాతో రాoచందర్ రావు మాట్లాడుతూ...
ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక దేశవ్యాప్తంగా చేపట్టిన అతిపెద్ద కార్యక్రమాల్లో 'స్వచ్ఛ భారత్' ముఖ్యమైనదని గుర్తుచేశారు. పరిశుభ్రమైన సమాజం ఉండాలన్నది గాంధీజీ జీవితాశయమని, ఆ ఆశయాన్ని నిజం చేస్తూ ప్రధాని మోదీ స్వచ్ఛ భారత్ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టిన గాంధీజీకి, 'జై జవాన్ - జై కిసాన్' నినాదంతో దేశాన్ని నడిపించిన మహనీయుడు లాల్ బహదూర్ శాస్త్రి కి తన హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు.
పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడూ ఇందులో భాగస్వామి కావాలని రామచందర్ రావు పిలుపునిచ్చారు. మన ఇళ్లతో పాటు వీధులు, ఊళ్లను కూడా శుభ్రంగా ఉంచుకోవాలని ప్రతి ఒక్కరూ ప్రతినబూనాలన్నారు. మనమందరం కలిసికట్టుగా చేసే ఈ చిన్న ప్రయత్నాలతోనే మన దేశం మరింత పరిశుభ్రంగా, ఆరోగ్యంగా, అందంగా మారుతుందని ఆయన స్పష్టం చేశారు.