ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (IRCS) ఖమ్మం జిల్లా బ్రాంచ్ యొక్క పాలకవర్గ సభ్యుల ఎన్నికల నిర్వహణకు సంబంధించి నోటీసు, షెడ్యూల్‌ను ఎన్నికల అధికారి, జిల్లా ముఖ్య ప్రణాళికా అధికారి ఏ. శ్రీనివాస్ శనివారం విడుదల చేశారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ ఎన్నికల ప్రక్రియను నిర్వహించనున్నట్లు తెలిపారు. మొత్తం 15 జిల్లా కార్యవర్గ సభ్యుల స్థానాలకు గాను ఈ ఎన్నికలు జరగనున్నాయని, నామినేషన్ రుసుము రూ.10,000/- (తిరిగి చెల్లించబడదు) గా నిర్ణయించామన్నారు.
IRCS ఖమ్మం జిల్లా బ్రాంచ్ పాలకవర్గ సభ్యుల ఎన్నికల షెడ్యూల్ విడుదల
⏩ముఖ్య ప్రణాళికా అధికారి / ఎన్నికల అధికారి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీనివాస్.
ఎన్నికల నామినేషన్ల దాఖలు ఈ నెల 24 న ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు ఐడిఓసి, కలెక్టరేట్, ఖమ్మం నందు స్వీకరిస్తారని తెలిపారు. నామినేషన్ల పరిశీలన ఈ నెల 25 న ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు ఉంటుందని అన్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 26 న ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు ఉంటుందని, అర్హమైన నామినేషన్ల తుది జాబితాను ఈ నెల 26 న మధ్యాహ్నం 3:00 గంటల తర్వాత ప్రకటిస్తామన్నారు.
ఏకగ్రీవ అభ్యర్థుల ప్రకటన (పోటీ లేని పక్షంలో) ఈ నెల 26న సాయంత్రం 5:00 గంటల తర్వాత చేయనున్నట్లు ఎన్నికల అధికారి అన్నారు. పోలింగ్ ను అక్టోబర్ 4 న (ఆదివారం) ఉదయం 8:00 నుండి మధ్యాహ్నం 3:00 వరకు టీటీడీసీ భవనం, ఇల్లందు క్రాస్ రోడ్, రామాలయం దగ్గర, ఖమ్మం లో నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి తెలిపారు. ఓట్ల లెక్కింపు, ఫలితాలు & ఆఫీస్ బేరర్ల ఎంపిక అక్టోబర్ 4 న పోలింగ్ ముగిసిన తదుపరి చేపట్టనున్నట్లు అన్నారు.
నామినేషన్ పత్రాలను ఐడిఓసి, కలెక్టరేట్ ఖమ్మంలోని రూమ్ నెం: F-27 ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయం నందు పొందవచ్చని, పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ పత్రమును స్వయంగా మొదటి మరియు రెండవ ప్రపోజర్లతో కలసి ఎన్నికల అధికారికి అందజేయాలని అన్నారు. ఒక వ్యక్తి ఒక్క అభ్యర్థికి మాత్రమే ప్రపోజర్‌గా (మొదటి లేదా రెండవ) ఉండాలని, నామినేషన్‌తో పాటు రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలను సమర్పించాలని అన్నారు. ఓటు వేయడానికి వచ్చే సభ్యులు తప్పనిసరిగా ఐఆర్సిఎస్ గుర్తింపు కార్డు / ఆధార్ కార్డు లేదా ఇతర ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డును తెచ్చుకోవాలన్నారు.
భారతీయ పౌరుడు అయి ఉండి ircs లైఫ్ మెంబర్ మరియు లైఫ్ అసోసియేట్ మెంబెర్ షిప్ కలిగిన ప్రతి ఒక్కరు (ప్రభుత్వ ఉద్యోగులతో సహా) ఈ ఎన్నికలలో పోటీ చేయవచ్చను.
మరిన్ని వివరాలకు, ఓటర్ల జాబితా కొరకు ఎన్నికల అధికారి కార్యాలయాన్ని సంప్రదించవచ్చని ఎన్నికల అధికారి/ జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపారు.