హనుమకొండ(రైట్స్ మీడియా): హనుమకొండ ప్రెస్ క్లబ్లో మంగళవారం కుల, ప్రజా సంఘాల ప్రతినిధుల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో 60కి పైగా కుల, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొని, డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.
ఈ సందర్భంగా గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొనగాని యాదగిరి గౌడ్, ఉద్యమకారుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు రజినీకాంత్ రజక, ఉమ్మడి జిల్లా క్రైస్తవ సంఘం ప్రతినిధులు పాస్టర్ ఐసాక్, పాస్టర్ జోసెఫ్, బీసీ రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు చాపర్తి కుమార్, సీజేపీ జెన్జి ప్రజ్వల్ , న్యాయవేదిక రాష్ట్ర అధ్యక్షులు కేడల ప్రసాద్ పటేల్, మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు సునీల్ మాదిగ, ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ మాదాసి సురేష్, బావని రెడ్డి , టీడీపీ పార్టీ నాయకులు నరేష్, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ దాస్, విద్యుత్ ఉద్యోగుల సంఘం నాయకులు భిక్షపతి, మాస్టిన్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంగ నర్సయ్య, ఆర్ఎస్పీ పార్టీ నాయకులు శివాజీ, సంధ్య రెడ్డి, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జాతీయ అధ్యక్షులు కొమ్ముల బాబు, మైనారిటీ ఎండి అలీ , ఉద్యోగుల సంఘం నాయకులు ఎం.ఆర్.ఓ. సమ్మయ్య, ఫిజియో థెరపీ సంఘం డాక్టర్ రాము మాదిగ సంఘం స్వామి నిరుపేదల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రేమ్ మున్సిపాలిటీ శ్రవణ్ మాదిగ ఉద్యోగుల సంఘం రవీందర్ తదితరులు మాట్లాడుతూ,
డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ ఎన్నో సంవత్సరాలుగా వైద్య సేవలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, పేదలు, బడుగు బలహీన వర్గాల ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్నారని తెలిపారు.ప్రజా ఆరోగ్యం, సామాజిక సేవ, పేద ప్రజల సంక్షేమం, సహకార ఉద్యమం తదితర రంగాల్లో డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ అందిస్తున్న సేవలను గుర్తించి, వారికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని వారు కోరారు.సామాజిక సేవ, ప్రజాసేవలో విశేష అనుభవం ఉన్న డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ కి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(5) ప్రకారం సామాజిక సేవా రంగం కింద గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని వారు కోరారు.
డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ కుటుంబం గతంలోనుంచి, అలాగే ఆయన విద్యార్థి దశ నుంచే కాంగ్రెస్ పార్టీకి అందిస్తున్న సేవలను గుర్తించి, వారికి ఎమ్మెల్సీ పదవి కల్పించే అంశాన్ని ముఖ్యమంత్రి సానుకూలంగా పరిశీలించి, తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అలాగే, డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ కు ఎమ్మెల్సీ అవకాశం కల్పించే వరకు తమ సంఘాల తరఫున ప్రజాస్వామ్య పద్ధతిలో తమ మద్దతును కొనసాగిస్తామని బొనగాని యాదగిరి గౌడ్, చాపర్తి కుమార్, కేడల ప్రసాద్, సునీల్ మాదిగ, మాదాసి సురేష్, కొమ్ముల బాబు తెలిపారు.
60కి పైగా కుల, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో,డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ కి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో వివిధ కుల ప్రజా ఉద్యోగ నిరుద్యోగ యువత నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.