హనుమకొండ,అక్టోబర్ 27(రైట్స్ మీడియా): యువతను పలు సామాజిక కార్యక్రమాలలో భాగస్వాములను చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మై భారత్ కో ఆర్డినేటర్లు, ఇతర అధికారులను ఆదేశించారు.
మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో మై భారత్ కో ఆర్డినేటర్లు, అధికారులతో యువత కు సంబంధించిన అంశాలు, హనుమకొండ లోని యూత్ హాస్టల్ నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మై భారత్ పోర్టల్ లో ఎంతమంది యువత నమోదు అయ్యి ఉన్నారు, మై భారత్ ఆధ్వర్యంలో నిర్వహించే వివిధ కార్యక్రమాలను గురించి కలెక్టర్ మై భారత్ జిల్లా అధికారి భూక్యా సంజీవ్ ను అడిగి తెలుసుకున్నారు.