Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
రాష్ట్రాలు

పాము కాటుకు గురైన 9 ఏళ్ల బాలుడికి పునర్జన్మనిచ్చిన ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వైద్యులు...

పాము కాటుకు గురైన 9 ఏళ్ల బాలుడికి పునర్జన్మనిచ్చిన ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వైద్యులు...
Share Short Clip Download PDF

నిజామాబాద్(రైట్స్ మీడియా): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కట్ల పాము కాటుకు గురై మృత్యువుతో పోరాడిన 9 ఏళ్ల బాలుడు అజాన్ కు నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు.
అక్టోబర్ 5 రాత్రి పాము కాటుకు గురైన బాలుడిని బాన్సువాడలో ప్రాథమిక చికిత్స అనంతరం అక్టోబర్ 6వ తేదీన తెల్లవారుజామున 3:15 కు PICU లో చేర్పించడం జరిగిందని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ ఎల్ రాములు తెలిపారు.

అయితే కనురెప్పలు పడిపోవడం, మాట రాకపోవడం, శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందితో వచ్చిన బాలుడికి వెంటనే 20 వైల్స్ యాంటీ స్నేక్ వెనం (ASV), వెంటిలేటర్ సపోర్ట్ తో చికిత్స అందించడం జరిగిందన్నారు.
మూడవ రోజు స్పృహలోకి వచ్చిన బాలుడు, నాలుగవ రోజు వెంటిలేటర్ నుండి బయటకు వచ్చి పూర్తిగా కోలుకున్నాడు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉంది.
అత్యవసర సమయంలో సకాలంలో స్పందించి ప్రాణాలు కాపాడిన పీడియాట్రిక్ విభాగాధిపతి డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్. వెంకటేశ్వర్లు, డాక్టర్ కీర్తి మరియు వైద్య బృందాన్ని సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్. రాములు ప్రత్యేకంగా అభినందించారు.. బాధితుని కుటుంబ సభ్యులు బంధువులు ప్రభుత్వ ఆసుపత్రి వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Source / reference: Senior Journalist Nakka Rakesh, Erstwhile Nizamabad.