జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల పరిధిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (MPPS), కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాన్ని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ తరగతి గదులకు వెళ్లి విద్యార్థులతో ముచ్చటించి, వారి సబ్జెక్టుల పరిజ్ఞానాన్ని, చదివే-రాసే నైపుణ్యాలను మరియు అభ్యాస సామర్థ్యాలను కలెక్టర్ స్వయంగా పరీక్షించి, ఉపాధ్యాయులకు తగిన సూచనలు చేశారు. LEAP ప్రోగ్రామ్ ద్వారా ఇంగ్లీష్ భాషా నైపుణ్యాల పెంపు కార్యక్రమాన్ని పాటశాలలో అమలు చేయకపోవడంతో సంబందిత ఎం.ఈ.ఓ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఇంగ్లీష్ భాషపై పట్టు సాధించేలా "Active Participation" (చురుకైన భాగస్వామ్యం) పద్ధతుల ద్వారా బోధన అందించాలని కలెక్టర్ అధికారులను మరియు ఉపాధ్యాయులను ఆదేశించారు.

కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, విద్యార్థులను స్వయంగా భాగస్వాములను చేస్తూ భాషా నైపుణ్యాలను పెంపొందించాలని సూచించారు. పాఠశాల ఆవరణ, తాగునీటి వసతి, మరియు మరుగుదొడ్ల నిర్వహణను నిరంతరం శుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఉపాధ్యాయుల హాజరు శాతాన్ని, విద్యార్థుల ప్రగతి నివేదికలను తనిఖీ చేసి, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.

అనంతరం డోర్నకల్ కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ తరగతి గదులను సందర్శించి విద్యార్థినులతో మాట్లాడి వారి చదువు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల హాజరు శాతం, రికార్డులను పరిశీలించి వారి విద్యా నైపుణ్యాలను మెరుగుపరచడానికి ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. విద్యార్థినులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం, మధ్యాహ్న భోజనం అందించాలని సంబందిత అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ఉపాధ్యా యులు పాఠ్యాంశాలను వివరంగా అర్థ మయ్యే పద్ధతిలో పాఠాలు భోదించాలని, ఇంగ్లీష్ భాషపై పట్టు సాధించే విధంగా ప్రతి అంశాన్ని వివరంగా వివరించాల న్నారు. వారి ఉన్నత చదు వుల లక్ష్యాల గురించి అడిగి తెలుసుకుని ప్రోత్సహించారు.

ఈ తనిఖీ లో ఇంచార్జ్ డి.ఈ.ఓ ఎం.శ్రీరాములు, జి.ఈ.సి.ఓ గాయత్రి, ఎం.ఈ.ఓ అంగోత్ లక్ష్మా, కె.జి.బి.వి స్పెషల్ అధికారి షేక్ మున్ని, డోర్నకల్ ఎం.ఆర్.ఓ రాఘవ రెడ్డి, మునిసిపల్ వైస్ చైర్మెన్ మాద లావణ్య, శ్రీనివాస్, మునిసిపాలిటీ మేనేజర్ నరసింహ మూర్తి తదితరులు పాల్గొన్నారు.