Thursday, 17 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

నానో యూరియా వినియోగంపై రైతులకు అవగాహన - డెమో కార్యక్రమం

ఆత్మ ఆధ్వర్యంలో చెన్నారం, ల్యాభర్తి గ్రామాల్లో ప్రదర్శన.

నానో యూరియా వినియోగంపై రైతులకు అవగాహన - డెమో కార్యక్రమం
Share Short Clip Download PDF

ఆత్మ ప్రోగ్రాంలో భాగంగా వర్ధన్నపేట మండల పరిధిలోని చెన్నారం, ల్యాభర్తి గ్రామాలలో నానో యూరియా వినియోగంపై డెమో కార్యక్రమాన్ని వర్ధన్నపేట మండల వ్యవసాయ అధికారి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. వరి పొలాల్లో రైతులతో కలిసి నానో యూరియా పిచికారీ చేసి ప్రదర్శించారు.

ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి విజయ్ కుమార్ మాట్లాడుతూ

సాంప్రదాయ యూరియా వాడకం వల్ల భూసారం దెబ్బతింటోంది, ఖర్చు కూడా ఎక్కువ అవుతోంది. నానో యూరియా ఒక బాటిల్, ఒక బస్తా యూరియాతో సమానం. పిచికారీ చేస్తే ఆకుల ద్వారా త్వరగా మొక్క గ్రహిస్తుంది. ఎకరాకు 250-500 యం ఎల్ నానో యూరియాను 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. దిగుబడి పెరుగుతుంది, ఖర్చు తగ్గుతుంది. కాబట్టి రైతులు నానో యూరియాను వినియోగించాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో చెన్నారం, ల్యాభర్తి గ్రామాల ఏఈవోలు, రైతులు, ఆత్మ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.