Friday, 18 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

వర్దన్నపేటలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మకు ఘన నివాళులు

వర్దన్నపేటలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మకు ఘన నివాళులు
Share Short Clip Download PDF

తెలంగాణ వీరనారి, సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా వర్ధన్నపేట మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయుబ్ నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఆయుబ్ మాట్లాడుతూ

దొరల గడీలకు వ్యతిరేకంగా, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం పోరాడిన ధీరవనిత చాకలి ఐలమ్మ. తెలంగాణ ఆడబిడ్డలకు ఆమె ఎప్పటికీ స్ఫూర్తిదాయకం అని తెలిపారు. రజాకార్లకు, భూస్వాములకు భయపడకుండా నాడు ఆమె చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పేదల, బలహీన వర్గాల పక్షాన నిలబడుతుంది. ఐలమ్మ ఆశయాలను కొనసాగిస్తాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.