బిఆర్ఎస్, బిజెపి పార్టీల దళిత వ్యతిరేక వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ, దళిత సంఘాల ఆధ్వర్యంలో గురువారం రోజున వర్ధన్నపేట మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద వరంగల్ -ఖమ్మం జాతీయ రహదారిపై భారీ రాష్ట్ర రోకో నిర్వహించారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ ఆయుబ్ నాయకత్వంలో జరిగిన ఈ నిరసనలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు,దళిత సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల దళిత వ్యతిరేక విధానాలకు నిరసన - కాంగ్రెస్ ధర్నా
వర్ధన్నపేట అంబేద్కర్ సెంటర్ లో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఆయుబ్ ఆధ్వర్యంలో రాస్తారోకో.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఆయుబ్ మాట్లాడుతూ
తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తాత మధుపై తక్షణమే ఎస్సీ ఎస్టీ ఎస్సీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభ ముగిసిన అనంతరం సభా ప్రాంగణాన్ని శుద్ధి చేసి దళితులను అవమానించిన బిజెపి నేతలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ అధికారులపై బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కే రామారావు చేయి చేసుకున్న ఘటన అపార్టీ అహంకారానికి చట్టం పట్ల ఉన్న నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమని విమర్శించారు. ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ దళితులను, ప్రభుత్వ అధికారులను అవమానిస్తున్న ప్రజా వ్యతిరేక బీఆర్ఎస్ బిజెపి పార్టీలకు రాబోయే రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పోశాల వెంకన్న గౌడ్, పట్టణ పార్టీ అధ్యక్షుడు ఈగ దామోదర్ అయినవోలు ఆలయ చైర్మన్ కమ్మగాని ప్రభాకర్ గౌడ్, మండల్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ప్రశాంత్ వివిధ గ్రామాల సర్పంచులు, మండల, పట్టణ నాయకులు, కార్యకర్తలు అనుబంధ సంఘాల నాయకులు యూత్ నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.