కామారెడ్డి (రైట్స్ మీడియా): జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సాధ్యమైనంత త్వరగా నూతన భవనంలోకి మార్చేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అధికారులను ఆదేశించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా నిర్మాణ పనులను వేగవంతం చేసి, ఆసుపత్రిని త్వరగా నూతన భవనంలోకి మార్చేలా చూడాలని సూచించారు. ఆసుపత్రి మార్పు సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, ఆర్అండ్బీ అధికారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.