మరిపెడ(రైట్స్ మీడియా): మరిపెడ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కల్లు గీత కార్మికులకు కాటమయ్య రక్షక కవచాలను ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ పంపిణీ చేశారు.
గీత కార్మికులకు కాటమయ్య రక్షక కవచాల పంపిణీ
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,
గీత కార్మికుల భద్రత, సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. తాటి, ఈత చెట్లు ఎక్కే సమయంలో ప్రమాదాల బారిన పడకుండా కాటమయ్య రక్షక కవచాలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. గీత కార్మికులు ఈ రక్షక కవచాలను వినియోగించుకొని సురక్షితంగా తమ వృత్తిని కొనసాగించాలని సూచించారు.
గీత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, గీత కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.