వర్దన్నపేట మండల పరిధిలోని ఇల్లంద గ్రామానికి చెందిన మల్లెపాక సుశీల భర్త దూడయ్య కు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎం రిలీఫ్ ఫండ్) ద్వారా మంజూరైన రూ.30 వేల చెక్కును కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు పోశాల వెంకన్న గౌడ్ అందజేశారు. ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు ఆదేశాల మేరకు ఈ చెక్కును బాధిత కుటుంబానికి అందించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా పోశాల వెంకన్న గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు చొరవతో వర్ధన్నపేట నియోజకవర్గంలోని అనేక మంది పేద బాధిత కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందుతోందని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గడ్డం సమ్మయ్య, గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎద్దు రాజేంద్రప్రసాద్, దుప్పెల్లి ఏలీయా, మల్లెపాక అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు.
బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత