Thursday, 17 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
తెలంగాణ

చెల్పూర్ ఒకటవ వార్డు లో కొలువుదీరిన బాల గణేశుడు

⏩ బీసీ ఆజాది ఫెడరేషన్ డివిజన్ అధ్యక్షుడు పంజాల తిరుపతి గౌడ్ ఆధ్వర్యంలో బాల గణేశుడికి ప్రత్యేక పూజలు.

చెల్పూర్ ఒకటవ వార్డు లో కొలువుదీరిన బాల గణేశుడు
Share Short Clip Download PDF

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం చేల్పూర్ గ్రామంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని సోమవారం బాల గణేశుడికి హుజురాబాద్ బిసి ఆజాది ఫెడరేషన్ డివిజన్ అధ్యక్షుడు పంజాల తిరుపతి గౌడ్ ఆధ్వర్యంలో తన ఇంటి వద్ద ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా తిరుపతి గౌడ్ మాట్లాడుతూ..

ఆపదలను తొలగించే ఆది దేవుడు,
విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు
ఆ మహా పరమేశ్వరుని ప్రియ పుత్రుడువైన గణపయ్య అని అన్నారు.

సమస్త జీవకోటికీ సమస్యలు తీరి సామరస్యంతో ముందుకు సాగాలని, తెలంగాణ ప్రజలంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, పాడిపంటలతో అందరూ ఆనందంగా ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారులు బస్మంగి శంకరయ్య మరియు సాత్వికయ్య ఈ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ భగవంతుని కృపకు పాత్రులయ్యారు.

ఈ సందర్భంగా తిరుపతి గౌడ్ మాట్లాడుతూ..
చెల్పూర్ ఒకటవ వార్డు లో కొలువుదీరిన బాల గణేశుడు
చెల్పూర్ ఒకటవ వార్డు లో కొలువుదీరిన బాల గణేశుడు