కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల (అటానమస్) ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్ల ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల తయారీ, పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. “మట్టి విగ్రహం–పర్యావరణానికి మేలు, భవిష్యత్ తరాలకు భద్రత” అనే సందేశంతో విద్యార్థులు స్వయంగా విగ్రహాలను తయారు చేసి ప్రజలకు పంపిణీ చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కలువకుంట్ల రామకృష్ణ విగ్రహాలను పరిశీలించి, వాలంటీర్లను అభినందించారు. పీఓపీ విగ్రహాలకు బదులుగా మట్టి విగ్రహాలను వినియోగించడం ద్వారా నీటి కాలుష్యాన్ని తగ్గించవచ్చని పేర్కొన్నారు. వైస్ ప్రిన్సిపాల్స్ నితిన్ పాఠక్, టి. రాజయ్య, ఐక్యూఏసీ సమన్వయకర్త డా. హర్జోత్ కౌర్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారులు అర్జున్, ఎలిజబెత్ రాణి, తిరుపతి, రాజేందర్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.