మాత శిశు మరణాలను నివారించడంతో పాటు ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా ప్రభు త్వం పోషణ మాసం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని కుడా చైర్ పర్సన్ గుండు సుధారాణి అన్నారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ‘పోషణ్ మాసః 2026’ కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయి ‘పోషణ్ మేళా’ను శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. పోషకాహార లోపాన్ని నివారించి, ఆరోగ్యవంతమైన సమాజ స్థాపనే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కుడా ఛైర్‌పర్సన్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ , అదనపు కలెక్టర్ (రెవిన్యూ) రవి, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) శేషాద్రి హాజరయ్యారు.
జిల్లా స్థాయి ‘పోషణ్ మేళా’ వేడుకలు ఘనంగా నిర్వహణ
తల్లి... బిడ్డ ఆరోగ్యం గా ఉండేలా.. సమతుల ఆహారం..సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం: కుడా చైర్ పర్సన్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి.
ఈ కార్యక్రమం లో కుడా చైర్ పర్సన్ గుండు సుధా రాణి మాట్లాడుతూ...
పోషణ అన్నది కేవలం ఆహరం ఇవ్వడమే కాదు భవిష్యత్ తరాన్ని తయారు చేయడం అని, ప్రభుత్వ పథకాలు ప్రజలలోకి తీసుకెళ్లాలని ఇది అందరి భాద్యత అని అన్నారు. చిన్నారులు, మహిళల ఆరోగ్యంపై శ్రద్ధ వహించి ప్రతి ఒక్కరూ పోషకాహారాన్ని తమ రోజువారీ జీవనశైలిలో భాగం చేసుకోవాలని ఈ సందర్భంగా అన్నారు . గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారంపై అవగా హన కల్పించాలని,గర్భిణులు, బాలింతలు పోషకా హారం తీసుకుంటే మాతా శిశువు మరణాలను తగ్గించవచ్చని... పోషక విలువలు కలిగిన ఆహారాన్ని క్రమ పద్ధతుల్లో తీసుకుంటే మంచిదన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ..
పోషణ మాసం కార్యక్రమాలు జిల్లాలో అన్ని శాఖ ల సమన్వయం తో నిర్వహించుకోవాలని అన్నారు. గర్భిణులు, బాలింతలు, పిల్లలకు అంగన్‌వాడీల ద్వారా పౌష్టికాహరం అందిస్తూ పోషణ స్థాయిని పెంచడమే ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. పౌష్టికాహారం అందించడం తో పాటు.. దానిపై అవగహన కూడా కల్పించాలన్నారు.
ఈ కార్యక్రమం లో కుడా చైర్ పర్సన్, కలెక్టర్ గర్భిణులకు సంప్రదాయబద్ధంగా ‘శ్రీమంతం’ నిర్వహించి సీమంతపు సారెను అందజేశారు. అలాగే 7 నెలలు నిండిన చిన్నారులకు పౌష్టికాహారంతో ‘అన్నప్రాశన’ ను కూడా జరిపించారు.
పోషణ్ మేళా & ఆహార ప్రదర్శన:
వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఫుడ్ ఎగ్జిబిషన్ అందరినీ ఆకట్టుకుంది. వివిధ రకాల ఆహార సమూహాలు (Food Groups) ‘ఫుడ్ పిరమిడ్’ను ప్రదర్శించి, వాటి వల్ల కలిగే పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పౌష్టికాహారం ‘బాలామృతం’తో తయారు చేసిన రకరకాల రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకాలను ప్రదర్శించి అందరికీ అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమం లో DWO విశ్వజ,జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి,DMHO, DRDO, DYSO, ఆయుష్ DPM, CDPO లు పోషన్ అభియాన్ టీం , అంగన్వాడీ టీచర్స్, బెనిఫిషరీస్ పాల్గొన్నారు.