Thursday, 17 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జాతీయం

స్వర్ణ నియోజకవర్గం విజన్ యాక్షన్ ప్లాన్ అమలుపై ముఖ్యమంత్రి సమీక్ష

స్వర్ణ నియోజకవర్గం విజన్ యాక్షన్ ప్లాన్ అమలుపై  ముఖ్యమంత్రి సమీక్ష
Share Short Clip Download PDF

రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉంచేందుకు నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉంచేందుకు నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పేదరిక నిర్మూలన, ప్రజా సమస్యల త్వరిత పరిష్కారం, సుపరిపాలనే ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన స్వర్ణ నియోజకవర్గం విజన్ యాక్షన్ ప్లాన్ అమలుపై ప్రజా ప్రతినిధులు, అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. శుక్రవారం ఉండవల్లి లోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్సు లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, వీడియో కాన్పరెన్స్ ద్వారా ఎంపీలు, ఎమ్మెల్యేలు, యంగ్ ప్రొఫెషనల్స్, నాలెడ్జ్ పార్టనర్స్ తో ముఖ్యమంత్రి మాట్లాడారు.

నియోజక వర్గాల వారీగా విజన్ ప్లాన్ రూపొందించుకుని పని చేయడం దేశంలోనే ప్రధమంగా ఏపీలోనే అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు. దీనికి జాతీయ స్థాయిలో మంచి పేరు వచ్చిందని చెప్పారు. ఈ క్రమంలో నియోజకవర్గాల విజన్ ను సమర్థవంతంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. నియోజకవర్గాల విజన్ ప్లాన్ అమలులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలది కీలక పాత్ర అని చెప్పారు. రూపొందించుకున్న కీ-పెర్ఫామెన్స్ ఇండికేటర్లకు అనుగుణంగా ఆయా రంగాల్లో వృద్ధి నమోదు చేసేలా పని చేయాలని ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. నియోజకవర్గాల విజన్ ప్లానులో యంగ్ ప్రొఫెషనల్స్, నాలెడ్జ్ పార్టనర్లు, స్వర్ణ కార్యాలయాల సిబ్బంది కీలక పాత్ర పోషిస్తారని... ఆ మేరకు వీళ్లంతా వినూత్నంగా ఆలోచించి ప్రజలకు మెరుగైన సేవలు అందించడం... ఆయా నియోజకవర్గాల అభివృద్ధికి కృషి చేయడం వంటి అంశాలపై ఫోకస్ పెట్టాలని సూచించారు. స్థానికంగా ఉండే వనరుల లభ్యతను ఆధారంగా చేసుకుని ఆయా నియోజకవర్గాల అభివృద్ధికి ప్రణాళికలను సిద్దం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని నియోజక వర్గాల విజన్ ను అందించామని, ఆయా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా విజన్ ను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. వివిధ అంశాలకు సంబంధించిన సమాచారాన్ని అందించేందుకు డేటా లేక్ సిద్దం చేశామని... అందుబాటులో ఉన్న సమాచారాన్ని విశ్లేషించుకోవడంతోపాటు.. పూర్తి స్థాయిలో టెక్నాలజీని వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. నియోజకవర్గాల యాక్షన్ ప్లాన్ అమలుపై ఎమ్మెల్యేలు ఎప్పటి కప్పుడు సమీక్షలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. మంత్రి పయ్యావుల కేశవ్‌, ఆర్థిక, ప్రణాళిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్, ఏపీఎస్ డిపీఎస్ ఈడీ వీఆర్ అలపర్తి సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశం లో పాల్గొన్నారు.

Source / reference: Story Line :SHABD,Amaravati, August 28,