హన్మకొండ సుబేదారిలోని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు క్యాంపు కార్యాలయంలో శుక్రవారం రక్షాబంధన్ పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకి హనుమకొండ మల్లికంబ మనోవికాస కేంద్రంలోని చిన్నారులు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు. చిన్నారులుకు ఎమ్మెల్యే మిఠాయిలు పంచిపెట్టి ఆశీస్సులు అందించారు. వర్ధన్నపేట నియోజకవర్గం లోని వివిధ ప్రాంతాలు నుంచి తరలివచ్చిన మహిళా నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో పార్టీ కార్యాలయంలో సందడి నెలకొంది. తనకు ఆప్యాయంగా రాఖీలు కట్టిన మహిళలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. వారికి బహుమతిగా చీరలను అందజేశారు. వారితో కాసేపు ఆత్మీయంగా మాట్లాడి, కుటుంబ సభ్యుల క్షేమ సమాచారాన్ని కూడా అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలోని ప్రతి అక్కాచెల్లెమ్మ ఆనందంగా, సురక్షితంగా ఉండాలని, వారి కుటుంబాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఎమ్మెల్యే నాగరాజు ఈ సందర్బంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి నిమ్మని శేఖర్ రావు , నాయకులు కృష్ణమూర్తి, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా రాఖీ వేడుకలు...