Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
రాష్ట్రాలు

ఎంపీ ఈటల రాజేందర్ చేపట్టిన మహా పాదయాత్రకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు సంపూర్ణ మద్దతు

జవహర్‌నగర్ డంపింగ్ యార్డును తక్షణమే తరలించాలని డిమాండ్ చేస్తూ మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ చేపట్టిన ‘ఛలో జవహర్‌నగర్’ మహా పాదయాత్రకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు సంపూర్ణ సంఘీభావం..

ఎంపీ ఈటల రాజేందర్ చేపట్టిన మహా పాదయాత్రకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు సంపూర్ణ మద్దతు
Share Short Clip Download PDF

జవహర్‌నగర్ డంపింగ్ యార్డును తక్షణమే తరలించాలని డిమాండ్ చేస్తూ మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ చేపట్టిన ‘ఛలో జవహర్‌నగర్’ మహా పాదయాత్రకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు సంపూర్ణ సంఘీభావం..

మేడ్చల్–మల్కాజిగిరి(రైట్స్ మీడియా):
జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల పక్షాన నిలిచి, యార్డును తక్షణమే తరలించాలని డిమాండ్ చేస్తూ మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ చేపట్టిన ‘ఛలో జవహర్‌నగర్’ మహా పాదయాత్రకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు సంపూర్ణ సంఘీభావం తెలిపారు. మంగళవారం ఉదయం ఘట్‌కేసర్ మండలం ఎదులాబాద్ లక్ష్మీనారాయణ చెరువు వద్ద ప్రారంభమైన పాదయాత్రలో ఆయన స్వయంగా పాల్గొని ఈటల రాజేందర్‌తో కలిసి నడిచారు.

ఈ సందర్భంగా ఎన్. రాంచందర్ రావు మాట్లాడుతూ,

భవిష్యత్ తరాల ఆరోగ్యం మరియు శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ ప్రజా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో పాదయాత్ర చేపట్టిన ఈటల రాజేందర్‌ను మనస్ఫూర్తిగా అభినందించారు. గతంలో కొంపల్లి మోహన్ రెడ్డి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT)లో కేసు వేసినప్పుడు, డంపింగ్ యార్డును తరలించడంతో పాటు శాస్త్రీయంగా క్యాపింగ్ చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని గుర్తుచేశారు. అయితే ఆ క్యాపింగ్ ప్రక్రియ ఏమైందో, నిబంధనలు ఎందుకు అమలు కావడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక చెర్యాల, ఎదులాబాద్ పరిసర ప్రాంతాల్లో కాలుష్యం, దుర్గంధం వల్ల ప్రజలు ఒక్క నిమిషం కూడా నివసించలేని దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని, భూగర్భ జలాలు విషతుల్యమై కలుషిత నీటి కారణంగా ఎదులాబాద్ చెరువులోని చేపలను మార్కెట్‌లో ఎవరూ కొనుగోలు చేయని దయనీయ పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కాలుష్య ప్రభావం కేవలం స్థానికంగానే కాక జూబ్లీహిల్స్, తార్నాక, ఉస్మానియా విశ్వవిద్యాలయం వరకు వ్యాపిస్తోందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా  ఎన్. రాంచందర్ రావు మాట్లాడుతూ,

తాను ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో ఢిల్లీలోని 'ఓఖ్లా వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్'ను పరిశీలించిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ... అక్కడ పారిశ్రామిక ప్రాంతమైనప్పటికీ నియమ నిబంధనలకు లోబడి రాత్రి వేళల్లో మాత్రమే వ్యర్థాలను తరలిస్తూ, శాస్త్రీయ పద్ధతుల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారని, పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా నిర్వహిస్తున్నారని తెలిపారు. కానీ జవహర్‌నగర్ విషయంలో కనీస నిబంధనలు కూడా పాటించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని, దీనిపై ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రశ్నించారు.

ఈ సమస్య తీవ్రతపై ఎంపీ ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేసి నెల రోజులు గడిచినా ఎలాంటి స్పందన లేకపోవడం వల్లే ఈ పోరాటం ఉద్యమ రూపం దాల్చిందని స్పష్టం చేశారు. జవహర్‌నగర్ డంపింగ్ యార్డును పూర్తిగా మూసివేసి శాశ్వతంగా తరలించే వరకు ఈ న్యాయమైన ప్రజా పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు.

ఎంపీ ఈటల రాజేందర్ చేపట్టిన మహా పాదయాత్రకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు సంపూర్ణ మద్దతు

అలాగే, రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలు, విచ్ఛిన్నకర విధానాలను ఎండగడుతూ ఎస్ఐఆర్ (SIR)పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి ప్రజలకు చైతన్యం కల్పించేలా నవంబర్ 2వ తేదీన ట్యాంక్ బండ్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టనున్న మహా పాదయాత్రకు ప్రజలు, శ్రేణులు భారీ ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.

ఈ పాదయాత్రకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారని గుర్తుచేశారు. ఇదే క్రమంలో రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదు (ఎన్‌రోల్‌మెంట్) ప్రక్రియను పార్టీ శ్రేణులందరూ చురుగ్గా ముందుకు తీసుకెళ్లాలని రాంచందర్ రావు సూచించారు.

ఎంపీ ఈటల రాజేందర్ చేపట్టిన మహా పాదయాత్రకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు సంపూర్ణ మద్దతు