నిజామాబాద్ జిల్లా(రైట్స్ మీడియా): బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని పోచంపాడ్ శ్రీరామ్ సాగర్ మత్స్య చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం నందు సిమెంటు నర్సరీలో మొసలి పిల్ల కనిపించింది. ఫామ్ సిబ్బంది అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో నగరానికి చెందిన జంతు సంరక్షకులు అంజాద్, అసద్ సహకారంతో మొసలిని చాకచక్యంగా బంధించారు.
అనంతరం అటవీశాఖ అధికారుల ఆధ్వర్యంలో సురక్షిత ప్రాంతానికి తరలించారు. మొసలిని రెస్క్యూ చేయడంలో సహకరించిన అంజాద్, అసద్లను అటవీశాఖ సిబ్బంది అభినందించారు.