ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రభుత్వ భాగస్వామ్యాలపై రెండు ప్రభుత్వాల అధికారులు చర్చలు చేశాం. అమరావతితో పాటు అన్ని మునిసిపాలిటీల అభివృద్దికి యూకే ప్రభుత్వం సహకారం అందించనుంది. ప్రపంచంలోని టాప్ 5 నగరాల్లో ఒకటిగా అమరావతి నిర్మాణానికి ఎంఓయూ ఉపయోగపడుతుంది. ఇన్ ఫ్రాస్ట్రక్చర్,అర్బన్ ప్లానింగ్,టెక్నాలజీ ట్రాన్స్ఫర్,అర్బన్ మొబిలిటీ లపై కలిసి పనిచేస్తారు. కేంద్ర - రాష్ట్ర నిధులతోఎ మునిసిపాలిటీల్లో 40 వేల కోట్ల విలువైన పనులు ప్రారంభించాం. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నా మౌళిక వసతులకు సీఎం ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు.