RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
జాతీయం
యూకె ప్రభుత్వంతో ఏపీ మున్సిపల్ శాఖ ఒప్పందం
మంత్రి నారాయణ సమక్షంలో మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్ కుమార్, యూకె ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసారు. సమావేశానికి ఏపీ,తెలంగాణ బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ విన్ ఒవెన్ హజరయ్యారు.
News URL: https://rightsmedia.in/news/ap-municipal-department-signs-agreement-with-uk-government
మంత్రి నారాయణ మాట్లాడూతూ..
ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రభుత్వ భాగస్వామ్యాలపై రెండు ప్రభుత్వాల అధికారులు చర్చలు చేశాం. అమరావతితో పాటు అన్ని మునిసిపాలిటీల అభివృద్దికి యూకే ప్రభుత్వం సహకారం అందించనుంది. ప్రపంచంలోని టాప్ 5 నగరాల్లో ఒకటిగా అమరావతి నిర్మాణానికి ఎంఓయూ ఉపయోగపడుతుంది. ఇన్ ఫ్రాస్ట్రక్చర్,అర్బన్ ప్లానింగ్,టెక్నాలజీ ట్రాన్స్ఫర్,అర్బన్ మొబిలిటీ లపై కలిసి పనిచేస్తారు. కేంద్ర - రాష్ట్ర నిధులతోఎ మునిసిపాలిటీల్లో 40 వేల కోట్ల విలువైన పనులు ప్రారంభించాం. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నా మౌళిక వసతులకు సీఎం ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు.