హైదరాబాద్(రైట్స్ మీడియా): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద 2026 ఆగస్టు/సెప్టెంబర్ ఫాల్ సెషన్లో విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థుల దరఖాస్తు గడువును అక్టోబర్ 15, 2026 నుంచి అక్టోబర్ 31, 2026 వరకు పొడిగించినట్లు బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బి. బాలామాయాదేవి తెలిపారు.
విదేశాల్లో మాస్టర్స్, డాక్టోరల్ కోర్సులు అభ్యసిస్తున్న లేదా అభ్యసించాలనుకునే అర్హులైన బీసీ, ఈబీసీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, నిర్ణీత గడువులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.